Site icon NTV Telugu

Soft water Jobs Fraud: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!

Soft Water Jobs Scam

Soft Water Jobs Scam

ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేయడం దేశవ్యాప్తంగా నిత్యం ఏదోమూల జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా కూడా ఈ మోసాలు ఆగడం లేదు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంతంగికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టిన లక్షలు దండుకున్నాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.

Also Read: Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య

వివరాల ప్రకారం… ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్జిఓ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికీ చెప్పాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగుల నుండి భారీగా డబ్బు తీసుకున్నాడు. ఉద్యోగాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. దాంతో అతడు ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version