Site icon NTV Telugu

Jowar Cucumber Roti Recipe: బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా బెస్ట్ హెల్తీ రొట్టెలు.. కీరా జొన్న రొట్టెలు ఇలా చేసేయండి..!

Jowar Cucumber Roti Recipe

Jowar Cucumber Roti Recipe

Jowar Cucumber Roti Recipe: ఇంట్లో ఉండే సాధారణ వంట పదార్థాలతో చాలా సులువుగా, తక్కువ సమయంలోనే తయారు చేసుకోనే హెల్తీ ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ మీకోసం. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా, రాత్రి లైట్ డిన్నర్‌గా అయినా చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. జొన్న పిండి, కీర వంటి పదార్థాలు ఉపయోగించడంతో ఇది శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. ఈ రొట్టెలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి.. ఇంకా చట్నీ అవసరం లేకుండా ఉట్టిగానే తినేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెరుగుతో తింటే రుచి ఇంకా పెరుగుతుంది.

మసాలా పేస్ట్:
ఈ రొట్టెల తయారీకి ముందుగా ఒక మసాలా పేస్ట్ తయారు చేయాలి. అందులో ముందుగా మిక్సీ జార్‌లో మీ కారానికి తగ్గట్టుగా రెండు లేదా మూడు పచ్చిమిర్చులు, ఐదు పెద్ద వెల్లుల్లి రెబ్బలు, అర అంగుళం అల్లం ముక్క, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని నీళ్లు పోయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టాలి.

Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!

కీర లేదా సొరకాయ:
తర్వాత రెండు మధ్య సైజు కీరాలను శుభ్రంగా కడిగి తొక్క తీయకుండా తురుముకోవాలి. కావాలంటే కీరకు బదులుగా సొరకాయతో కూడా ఈ రొట్టెలు చేయవచ్చు. తురుముకున్న కీరలోకి ముందుగా తయారు చేసిన మసాలా పేస్ట్, ఒక మీడియం సైజు ఉల్లిపాయను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు, పావు టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అదనపు రుచికి వేయించని పల్లీలను కచ్చాగా గ్రైండ్ చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు.

పిండి మిశ్రమం:
ఇప్పుడు ఈ మిశ్రమంలోకి పిండి వేసుకోవాలి. ఒకటిన్నర కప్పుకు దగ్గరగా అంటే ఒకటి ఇంకొక పావు కప్పు జొన్న పిండి, పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసి ముందుగా పిండికి బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత కీర మిశ్రమంతో పిండిని రచ్చ చేయాలి. నీళ్లు అస్సలు పోయకూడదు. కీరలో ఉన్న నీరు మరియు పెరుగు వల్లే పిండి సరైన కన్సిస్టెన్సీకి వస్తుంది. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఉండాలి. ఒకవేళ పల్చగా అయితే కొంచెం గోధుమ పిండి వేసి సర్దుకోవచ్చు.

రొట్టె తయారీ:
రొట్టెలు ఒత్తడానికి ఒక కాటన్ క్లాత్ లేదా రుమాలు తీసుకుని నీటితో తడిపి బాగా పిండాలి. చేతిని కొద్దిగా నీటితో తడుపుకొని పిండిని తీసుకుని కావాల్సిన సైజులో పల్చగా ఒత్తుకోవాలి. పై నుంచి కొద్దిగా పచ్చి నువ్వులు చల్లి, ఊడిపోకుండా చేతితో లైట్‌గా ప్రెస్ చేయాలి. రొట్టె మరీ మందంగా కాకుండా పల్చగా ఉండేలా చూసుకోవాలి. పాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, క్లాత్‌తో సహా రొట్టెను పాన్‌పై వేసి నిదానంగా క్లాత్ తీసేయాలి. పై నుంచి మళ్లీ కొంచెం నువ్వులు వేసి ప్రెస్ చేసి మూత పెట్టాలి. లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో నెమ్మదిగా కాలనివ్వాలి. పై పచ్చిదనం తగ్గిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి రెండో వైపు తిప్పాలి. హై ఫ్లేమ్‌లో కాల్చకూడదు, తక్కువ మంట మీదే కాల్చితే లోపల వరకు చక్కగా ఉడుకుతాయి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేయాలి.

టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో రేపు Renault Duster విడుదల..

ఈ విధంగా తయారయ్యే కీర జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్తీ కూడా ఉంటాయి. జొన్న పిండి జీర్ణక్రియకు మంచిది. కీర శరీరానికి చలువు ఇస్తుంది. నువ్వులు కాల్షియం రిచ్. ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఈ కొలతలతో సుమారు ఆరు రొట్టెలు వస్తాయి. మీ అవసరాన్ని బట్టి పిండి పరిమాణం మార్చుకోవచ్చు. చట్నీ అవసరం లేకుండా ఉట్టిగానే తినేయొచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Exit mobile version