NTV Telugu Site icon

Viral Video: వీడు అస్సలు మనిషేనా? వీడియో తీస్తూ ఆనందం పొందుతున్న యజమాని..

Buffalo

Buffalo

పాము పేరు వినగానే చాలా మందికి భయం.. ఇక చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.. అది విష జాతికి సంబందించినది అందుకే జంతువులు సైతం పాములకు భయపడతాయి.. గజ రాజు సైతం పామును చూస్తే వణకాల్సిందే.. మొన్నీ మధ్య ఓ చిరుత పులి కూడా పాముకు భయపడన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.. తాజాగా ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా ఓ గేదెను పాము వణికించింది. ఆ సమయంలో గేదెను కాపాడాల్సిన యజమాని ఆ పని మానేసి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదె ను చెట్టుకు కట్టేసి ఉంది. ఆ సమయంలో ఓ పాము వేగంగా గేదె వైపు వెళుతోంది. గేదె దగ్గరకు వెళ్లిన తర్వాత పాము బుసలు కొట్టింది.. పామును చూసి గేదె బెదిరిపోయింది. అయితే కట్టేసి ఉండడం వల్ల ఆ గేదె తప్పించుకోలేక పోయింది. ఆ గేదెను కాపాడాల్సిన యజమాని మాత్రం నాకెందుకే అని వీడియో చేస్తూ ఉండిపోయాడు. చివరకు ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

ఈ వీడియో వైరల్ అవ్వడంతో మిలియన్ల మంది వీక్షించారు. 9.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ వీడియో తీస్తున్న వ్యక్తికి హృదయం లేదు.. వీడు అస్సలు మనిషేనా కొంచెం కూడా బుద్ది లేదు.. ఛీ ఇలాంటి వాడిని ఆ పాము కుడితే బాగుండు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.. మీరు ఆ వ్యక్తి చేసిన పనిని గురించి ఒకసారి చూసేయ్యండి..