Viral : సోషల్ మీడియాలో ఫేస్ మేకప్ వీడియోలు చాలా చూస్తూనే. చాలా మంది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ మీరు అసాధారణమైన మేకప్ వీడియోలను చూశారా? కెనడాలోని వాంకోవర్‌కు చెందిన మిమీ చోయ్ శరీర భాగాలపై త్రీడీ మేకప్ వేసుకుని అందరినీ ఆకర్షిస్తోంది. మిమీ తన బాడీపై మేకప్ వేసుకుని ఎన్నో అద్భుతాలు సృష్టించిన కళాకారిణి. ఈ క్రమంలో తాను వేసుకున్న ఒలిచిన పండు, రొయ్యలు, నూడుల్స్, పుచ్చకాయ, బ్రెడ్, బేసి ఆకారాలకు నెటిజన్స్ ఫిదా అయిపోయారు.
Read Also: Indian Dams : నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్న భారతీయ డ్యామ్లు.. ఆందోళనలో నిపుణులు
మిమీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. మిమీ తను ఆర్ట్ వేసుకున్న అన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. తాను ఎక్కువగా తన శరీరంపై మేకప్ వేసుకున్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం కాళ్లపై మేకప్ వేసుకున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Rotten Coconut Business: బుర్రుండాలే కానీ.. తేలిగ్గా బిలియనీర్ కావొచ్చు
తాను స్కూల్లో నేర్చుకున్న ఇల్యూజన్ మేకప్ తాను ఈ రంగంలో ఎదగడానికి దోహదపడింది. మిమీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సెలబ్రిటీలు మెట్ గాలాతో సహా ప్రదర్శన నిమితం వివిధ మేకప్ కోసం మిమీని సంప్రదిస్తారు. వారు పోస్ట్ చేసిన వీడియోలకు చాలా కామెంట్స్, లైక్‌లు వస్తున్నాయి.