NTV Telugu Site icon

MS Dhoni Birthday : సతీమణితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ధోని.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరుస్తున్న విషెస్.. (video)

Hbd Dhoni

Hbd Dhoni

MS Dhoni Birthday : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43 పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు.. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ పుట్టినరోజును తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి తన భార్య సాక్షి సింగ్ కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత ధోనికి సాక్షి కేక్ వినిపించిన తర్వాత ఆయన కాళ్లకు నమస్కరించింది. ధోని కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో హీరో సల్మాన్ కూడా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఈ సందర్భం సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Encounter : కుల్గామ్‌లో భారీ ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది ఉగ్రవాదులు, ఇద్దరు జవాన్లు మృతి

ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ మహేందర్ సింగ్ ధోని కి బర్త్ డే విషెస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హ్యాపీ బర్త్డే కెప్టెన్ సాబ్ అంటూ.. మహేంద్రసింగ్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు క్రికెటర్స్ పెద్ద ఎత్తున ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తన సహచర ఆటగాడు సురేష్ రైనా కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా.. హ్యాపీ బర్త్డే మహి భాయ్.. నీ హెలికాప్టర్ షాట్, స్టెమ్పింగ్ స్కిల్స్ లా రోజు నువ్వు కూల్ “గా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు బీసీసీఐ కూడా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అందులో ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీలతో ఉన్న ధోని ఫోటోను షేర్ చేసింది.

MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి

Show comments