Site icon NTV Telugu

Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..

Shobitha

Shobitha

‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ చిత్రం ‘చీకటిలో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో శోభిత తన పాత్ర గురించి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

Also Read : Ashika Ranganath : మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసిన బ్యూటీ ఆషిక రంగనాథ్..

శోభిత మాట్లాడుతూ.. ఇందులో తాను ‘సంధ్య’ అనే పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపిస్తాను, సంధ్య చాలా ధైర్యవంతురాలు. తన నమ్మకం కోసం ఎవరు ఉన్నా లేకపోయినా నిలబడే అమ్మాయి. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషనల్ జర్నీ. కష్టం వస్తే భయపడి వెనకడుగు వేయకుండా, ముందడుగు వేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సంధ్య పాత్ర ద్వారా చెప్పబోతున్నాం’ అని వివరించింది. ఈ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడం పట్ల శోభిత సంతోషం వ్యక్తం చేసింది. ‘నాకు నచ్చిన పాత్రకు నేను వంద శాతం న్యాయం చేస్తాను, మిగతా ఫలితాన్ని ప్రేక్షకులే తేలుస్తారు. నా వాళ్ళని కూడా ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి అభిప్రాయాలు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అని చాలా ఓపెన్ గా చెప్పింది. అలాగే

సినిమా ఇండస్ట్రీలో తన జర్నీ గురించి మాట్లాడుతూ.. ‘నేను ముంబై వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి నా ప్రయాణం మొదలు పెట్టాను. ఒక ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి, ఇక్కడ జెండా పాతాలి అని నేను ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు. ఒకవేళ ఇండస్ట్రీలో బేరాలు, లెక్కలు వేసుకుంటే నటిగా కొనసాగడం చాలా కష్టం. నేను చేసే ప్రతి పాత్ర నా మనసుకు నచ్చాలి. అనురాగ్ కశ్యప్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పని చేసినందుకు చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని తెలిపింది. త్వరలోనే తన తమిళ సినిమా కూడా తెలుగులో విడుదల కానుందని ఆమె వెల్లడించింది.

Exit mobile version