Actress Sobhita Dhulipala Trends At #2: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ‘ఐఎండీబీ’ తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్ 2లో నిలిచారు. ఈ వారం పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌ను ఐఎండీబీ విడుదల చేయగా.. ‘ముంజ్యా’ నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానంను నిలుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో శోభిత నిలిచారు. షారుక్, కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా టాప్ 5లో ఉన్నారు.
టాలీవుడ్ హీరో నాగచైతన్యతో ఆగస్టు 8న హైదరాబాద్‌లో శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో శోభిత పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు. దీంతో శోభిత ఈవారం ఇండియన్ పాపులర్ సెలబ్రిటీగా నిలిచారు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ శోభిత సినిమాలు చేస్తున్నారు. ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్ ప్రేక్షకులను ఆమె పలకరించారు.
Also Read: Congress Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం.. తెలంగాణ పీసీసీపై ప్రకటన!
2021లో సమంత, నాగచైతన్య జంట విడాకులు తీసుకున్నారు. 2022 నుండి శోభిత ధూళిపాళతో చై డేటింగ్ చేస్తున్నారు. 2023లో లండన్‌కు ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్లగా.. ఓ హోటల్ చెఫ్ వీరి పోటోలను షేర్ చేశారు. అప్పటినుండి చై-శోభిత వార్తల్లో నిలిచారు. చివరకు ఎంగేజ్‌మెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే పెళ్లి ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు.