Site icon NTV Telugu

Soggadu Re Release: ప్రేక్షకుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్థానం : మురళీమోహన్

Soggadu Re Release

Soggadu Re Release

Soggadu Re Release: శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్‌ను నిర్వహించారు.

READ ALSO: Sydney Terror Attack: సిడ్నీలో ఊచకోతకు కారణమైన పాక్ ఉగ్రవాది.. ఇతనే!

ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీమోహన్ పాల్గొని మాట్లాడుతూ.. “నాకు తొలి అవకాశం ఇచ్చింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే నన్ను ప్రోత్సహించింది దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు. నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను. ప్రేక్షకుల హృదయాలలో శోభన్ బాబుది శాశ్వత స్థానం ” అని అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “1975లో విడుదలైన ‘సోగ్గాడు’ చిత్రం తమ సంస్థకు మంచి పేరును, డబ్బును తెచ్చిపెట్టింది. సౌండ్‌కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కైకాల నాగేశ్వరరావు, అట్లూరి పూర్ణ చంద్రరావు, కె.ఎస్.రామారావు, తదితరులు పాల్గొన్నారు.

READ ALSO: Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై చేయండి

Exit mobile version