NTV Telugu Site icon

Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. అదిరిపోయే లుక్ లో స్నేహారెడ్డి..

Alluuu

Alluuu

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు.. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.. ఈరోజు బన్నీ 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి రచ్చ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

బన్నీ పుట్టినరోజు రోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని భార్య అల్లు స్నేహా రెడ్డి ఇంట్లోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కు ఓ గ్రాండ్ పార్టీ ని ఏర్పాటు చేసింది.. ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ పార్టీలో స్నేహా రెడ్డి వైట్ డ్రెస్సులో అదిరిపోయే లుక్ లో కనిపించింది.. ఆ డ్రెస్సులు స్నేహ చాలా అందంగా స్టైలిష్ గా ఉంది.. ఇక అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఆ కేక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.. చివరి షెడ్యూల్ షూటింగ్ పెండింగ్ లో ఉంది.. ఈ
సినిమాను ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. విడుదల తేదీన్ని ఎప్పుడో ప్రకటించారు.. తాజాగా బన్నీ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది..