Site icon NTV Telugu

Viral Video: 15 అడుగుల కింగ్ కోబ్రా.. చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే

Snake

Snake

పామును చూడగానే భయపడే వారు చాలామంది ఉంటారు. సామాన్యంగా పామును చూస్తే కాళ్లు, చేతులు ఆడవు. అందులోనూ కింగ్ కోబ్రా అంటే కింది నుంచి కారిపోతుంది. ఇటీవలి కాలంలో భారీ సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిని కొందరు భయం లేకుండా పట్టుకుని అటు పాములను, ఇటు జనాలను కూడా రక్షిస్తున్నారు. ఇప్పుడు అలాంటిదే 15 అడుగుల కింగ్ కోబ్రా తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీ పరిసరాల్లో కనిపించింది.

Eoin Morgan: ఒత్తిడిలో రాణించగల సామర్థ్యం ఆ జట్టుకు ఉంది.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

కడయం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో 15 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి దానిని రక్షించారు. కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ బృందం ప్రయత్నించగా.. బుసలు కొడుతూ మీదకు వస్తుంది. ఎట్టకేలకు దానిని బంధించి ఓ సంచిలో వేశారు. ఆ తర్వాత అడవిలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Rohit Sharma: ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో ఫోన్ రింగ్.. రోహిత్ శర్మ ఫైర్..!

Exit mobile version