Site icon NTV Telugu

Snake Raja: వీడెవడ్రా స్వామి.. వాటిని పాములనుకున్నాడా లేక మరేమైనా అనుకున్నాడా.. వైరల్ వీడియో..

Snake Raja

Snake Raja

సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయపడతారు. వాటిని దగ్గరగా చూస్తే ఇక అంతే సంగతులు. పాములు చాలా విషపూరితమైనవి కాబట్టి వాటికీ కాస్త దూరంగా ఉండడమే మంచిది. కాకపోతే ఓ వ్యక్తి, ఏకంగా ఆరు పాములను పట్టుకుని ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కావాలనే ఇలా చేశాడో., లేక వైరల్ అయ్యేందుకే చేశాడో తెలియదు కానీ.. యువకుడి పాము ట్రిక్ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తన చేతులతో ఆచం చేతిలో కర్రల మాదిరిగా పట్టుకున్నట్లు దాదాపు ఆరు పాములను పట్టుకున్నాడు. ఆపై అతను పాములతో ఆడుకుంటూ కనిపించాడు. అయితే పాములను ఈ విధంగా హింసించడం సరికాదన్న వివాదాల మధ్య అతడు పాములతో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Hyderabad Metro: మ్యాచ్ కు వెళ్లి తిరుగుప్రయాణం లేట్ అవుతుందా.. మెట్రో రైళ్లు ఉండగా భయమేల..

ఇక సంఘటన జరిగిన తేదీ, ప్రదేశం లాంటి విషయాలు తెలియరాలేదు., అయితే ఈ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఇంస్టాగ్రామ్ లో ఓ వినియోగదారు పోస్ట్ చేసాడు. “ర్యాట్ స్నేక్” అనే శీర్షికతో ఈ పోస్ట్ పెట్టారు. కొద్దీ రోజుల క్రితం ఈ పోస్ట్ షేర్ చేయగా., కేవలం లైకులే లక్ష కంటే ఎక్కువ వచ్చాయి.

Also Read: T20 World Cup: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ చూసే అవకాశం

వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. పాములు విషపూరితమైనవి. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి విన్యాసాలు ప్రమాదకరం. వారు “జంతువుల పట్ల హింస” చేసిన వ్యక్తిని శిక్షించాలనుకుంటున్నారు.

Exit mobile version