NTV Telugu Site icon

Snake In Cauliflower: క్యాలీఫ్లవర్ లో కట్లపాము.. చూస్తే పై ప్రాణం పైకే పోతుంది

Snake

Snake

Snake In Cauliflower: మనం హోటల్ కు వెళ్లినప్పుడో, లేదా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడో అప్పుడప్పుడు మనం తినే ఫుడ్ లో బొద్దింకలు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు రావడం చూస్తూ ఉంటాం. ఇటువంటి ఘటనలకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో కూడా తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. కొంత మందికి ఆహారంలో బల్లిపడి ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.   ఆహారంలో పాము తల వచ్చిందని ఇటీవల ఓ వార్త వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇవన్నీ కాదు అసలు బయట ఫుడ్ వద్దు మేమే ఇంట్లో వండుకుంటామని కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా తెచ్చుకున్న కూరగాయల్లో పాములు, తేళ్లు లాంటివి కనిపిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటుంటేనే ఒళ్లుగగుడ్పొడుస్తోంది కదూ.  నిజంగానే  ఓ కుటుంబం తెచ్చుకున్న క్యాలీఫ్లవర్ లో కట్ల పాము పిల్ల ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే వివరాలు అయితే తెలియదు కానీ దేవేంద్ర షైనీ అనే యూజర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ దీనిని ఏం కాలీఫ్లవర్ అనుకోవాలి ? ఇది కోబ్రా కాలీఫ్లవరా లేక వైపర్ కాలీ ఫ్లవరా అంటూ తాను పోస్ట్ చేసిన వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోలో మనం గమనించినట్లయితే ఒక క్యాలిఫ్లవర్ లో చిన్న పాము పిల్ల కనిపిస్తోంది. మొదట కేవలం దాని తల మాత్రమే పైకి కనిపిస్తోంది. తరువాత ఆ వ్యక్తి దానిని బయటకు తీయడానికి క్యాలిఫ్లవర్ ను కొంచెం కొంచెం విరుస్తూ ఉంటాడు. ఆ పాము పిల్ల బయటకు వచ్చి ఆ క్యాలిఫ్లవర్ లో తిరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి  దాని తోక పట్టుకొని బయటకు లాగటానికి ఎంత ప్రయత్నించిన అది బయటకు రాదు. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం కచ్ఛితంగా భయంగా, ఒక్కసారిగా ఒళ్లు జలదరిస్తుంది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కూరగాయలు కొంటే తేళ్లు, పాములు ఫ్రీ ఏమో అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. అయితే వర్షాకాలం కాబట్టి కూరగాయల్లో పురుగులు, తేళ్లు, వానపాములు లాంటివి ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి అంటూ మరికొందరు సూచిస్తున్నారు. వీడియో చూస్తుంటేనే చాాలా భయమేస్తుందని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు.

 

Show comments