టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓ పాము కలకలం సృష్టించింది. అయితే.. ఆ పామును స్వయంగా టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పట్టుకుని బయట పడేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పాము చోరబడింది. ఆ కార్యాలయంలో మీడియా సమావేశాలు నిర్వహించే గదిలోకి పాము చొరబడింది. దీంతో ఆ సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఆందోళన చెందారు. అయితే… అక్కడే ఉన్న ఖమ్మం టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఇటీవలనే నియమితులైన పగడాల నాగరాజు ఆ పాముని చేతితో పట్టుకొని… బయట చెట్లల్లో వదిలి వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోంచి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి వచ్చినట్లుగా భావిస్తున్నారు నేతలు.
పార్టీ కార్యాలయంలోకి పాము కలకలం..పట్టుకుని బయటపడేసిన టీఆర్ఎస్ నేత !
