Site icon NTV Telugu

Snake Found in Curry Puff: కర్రీ పఫ్‌లో పాము పిల్ల ప్రత్యక్షం.. షాక్‌లో కుటుంబీకులు..

Mbnr

Mbnr

Snake Found in Curry Puff: చాలా మంది బయటి ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు. అయితే తినేది ఆహారమా.. విషమా..? అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు విపరీతంగా పెరుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్‌ జిల్లా పరిధిలో ఓ వార్త సంచలనంగా మారింది. ఓ బెకరీ నుంచి కర్రీ పఫ్ ఆర్డర్ చేసిన కుటుంబ సభ్యులకు ఒళ్లు జలదరించే ఘటన జరిగింది.

READ MORE: Medical College Scam: ఘరానా మోసం.. మెడికల్ కళాశాలలో ఉద్యోగం దొరకిందని సంబరపడ్డ ఉద్యోగులు.. చివరకు?

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల లో ఓ కుటుంబం వాతావరణం చల్లగా ఉండటంతో టేస్టీ ఫుడ్ తిందామని బెకరీ నుంచి కర్రీ పఫ్ ఆర్డర్ చేశారు. దాన్ని తినడం ప్రారంభించారు. అంతలో ఆ కర్రీ పఫ్ లో చిన్న పాము పిల్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయాందోళనకు గురైన బాధితులు ఆ బేకరీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఆ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగానే గుర్తించడంతో ఆ ఫ్యామిలీ ప్రమాదం నుంచి బయటపడింది.

READ MORE: Crime News: మేనత్తతో అల్లుడు వివాహేతర బంధం.. మామ మందలించడంతో దారుణం!

Exit mobile version