Site icon NTV Telugu

Snake vs centipede: పాముతో జెర్రి బిగ్ ఫైట్.. చివరకు?

Viral

Viral

Snake vs centipede Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యల వీడియోలు చూస్తూనే ఉంటాం. అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇకపోతే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఓ పాము, జర్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో జెర్రీ పాముపై ఎలా పోరాడిందోన్న విషయాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Minister Jupalli: దొంగే దొంగ అన్నట్లు కేసీఆర్, హరీశ్ పరిస్థితి ఉంది..

నాటికల్ నైట్మేర్స్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. మొదటగా ఓ పాము జెర్రిని చూసి దానిని కాటేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే కొద్దిసేపటికే జెర్రీ పాముపై తిరుగుబాటు చేయడం వీడియోలో మనం గమనించవచ్చు. మొదట పాము జెర్రీ పై పలుమార్లు తన కోరలతో విషయం చిమ్మగా.. కానీ., జెర్రీ పట్టుదలతో పాము పైకి ఎదురుదాడి దిగి చివరికి పాము నోటిని గట్టిగా పట్టుకుంది. అలా పాము నోటిని గట్టిగా పట్టుకున్న తర్వాత దాన్ని కొరకడం మొదలుపెట్టేసింది. ఇంకేముంది అలా కొద్దిసేపు జరగడంతో పాము ఏమి చేయలేక అలా పడిపోయింది. అయితే ఆ పాము చనిపోయిందో లేదో అన్నది మాత్రం ఈ వీడియోలో స్పష్టంగా తెలియరాలేదు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

SRSP: 61 ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

పాములు ఇంతవరకు ముంగిసలతో పోరాడుతున్న వీడియోలు చాలానే చూసాం కానీ.. ఇలా జెర్రీతో పోరాడే వీడియో మొదటిసారిగా చూస్తున్నాం అంటూ కామెంట్ చేయగా.. మరికొందరు ఎంత పెద్ద పాము అయినా సరే చలి చీమల ముందర తగ్గాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.

Exit mobile version