Sania Mirza: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన తన వివాహం రద్దు అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌కు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్థం అయ్యింది. ఈ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలతో వారి వివాహం వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ చివరికి వారి పెళ్లి రద్దు అయినట్లు ఇరువురు వేరువేరుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఒక మహిళా అథ్లెట్ జీవితంలో వివాహ ఘట్టం ఈ విధంగా ముగియడం ఇదే మొదటిసారి కాదు. గతంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం కూడా నిశ్చితార్థం తర్వాతనే రద్దు అయ్యింది.
READ ALSO: UP: కాటేసిన పోలీసు ప్రేమ.. సూసైడ్ చేసుకున్న ఇన్‌స్పెక్టర్.. వెలుగులోకి సంచలన నిజాలు
సానియా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆమెకు గతంలో వేరొకరితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ నిశ్చితార్థం పెళ్లి వరకు చేరుకోకుండానే ముగిసింది. వాస్తవానికి సానియా మీర్జా 2009లో షోయబ్‌కు ముందు వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నారని చాలా మందికి మాత్రమే తెలుసు. కానీ వారి నిశ్చితార్థ బంధం కేవలం ఆరు నెలలకే ముగిసింది. నిశ్చితార్థం జరిగిన కొన్ని నెలలకే సానియా, ఆమెకు కాబోయే భర్త పరస్పరం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని, వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో సానియా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వరుడు ఆమెకు కొత్తగా పరిచయం అయిన వ్యక్తి కాదు. వాళ్లిద్దరూ స్కూల్ లైఫ్ నుంచి ఒకరినొకరు తెలుసు. వారిద్దరికి జూలై 10, 2009న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యలో నిశ్చితార్థం జరిగింది. కానీ తర్వాత వాళ్లిద్దరూ ఈ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లకుండా ఆరు నెలలోనే వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
ఆ తరువాత సానియా షోయబ్ మాలిక్‌ను కలిసింది. వీరిద్దరూ 2010లో వివాహం చేసుకున్నారు. అయితే 14 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత, సానియా – షోయబ్ విడాకులు తీసుకున్నారు. వారికి ఇజాన్ అనే కుమారుడు కూడా ఉన్నారు. తర్వాత షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారు.
READ ALSO: T20 World Cup 2026: ఐసీసీకి గట్టి జలక్ ఇచ్చిన జియోహాట్‌స్టార్.. దెబ్బ మామూలుగా లేదు కదా!
