Site icon NTV Telugu

Smriti Irani : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యాడ్ వీడియా వైరల్

Smriti

Smriti

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వృత్తికి సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను పంచుకుంటారు. తాజాగా తను 25 సంవత్సరాల క్రితం యాక్టింగ్ చేసిన ఓ యాడ్ ను ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ పాత వీడియో చూసిన నెటిజన్స్ చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. గ్లామర్ ప్రపంచంలో సినిమా, యాడ్ ఒప్పుకునేందుకు నటీనటులు ఒకటికీ వందసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే చేసేది ఏదైనా దాని ప్రభావం భవిష్యత్ లో ఇతర అంశాలపై పడకూడదని భావిస్తారు.

Also Read : Harish Rao: మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన.. పట్టణాల్లో 500 బస్తీ దవాఖానాలు..

25 సంవత్సరాల క్రితం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెద్ద కంపెనీ యాడ్ లో నటించే అవకాశం దక్కింది. అదీ శానిటరీ ప్యాడ్ ప్రకటన.. స్మృతి ఇరానీ కెరియర్ అప్పుడు ప్రారంభించింది. సహజంగా కెరియర్ లో అడుగు పెడుతూనే ఇలాంటి యాడ్ లలో నటించడం ఎంత వరకూ కరెక్ట్ అని చాలా మంది సందిగ్థంలో ఉంటారు. కానీ ఆమె ఈ యాడ్ లో నటించడానికి అస్సలు ఆలోచించకుండా ఓకే చెప్పారట. రుతుస్రావం సమయంలో స్త్రీలు పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతపై ఎందుకు మాట్లాడకూడదు.. ఇందులో తప్పేముందని ఆమె ఆ ప్రకటనలో నటించారట. ఇప్పుడు అదే యాడ్ ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అప్పటికీ ఇప్పటికీ మీ వాయిస్, భాష మీద పట్టు అలాగే ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మీరేం మారలేదు అని కొందరు.. భాషపై మీకున్న కమాండ్ కి మేము అభిమానులం అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Rajini Kanth : అందుకే రజనీ సూపర్ స్టార్ అయ్యారు

Exit mobile version