NTV Telugu Site icon

Smriti Irani: అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన స్మృతి ఇరానీ..

Irani

Irani

ఈరోజు బీజేపీ తరపున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్‌లల్లాను దర్శించుకున్నారు. ఆ తర్వాత తన లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. మే 20వ తేదీన అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) నాడు ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: Sanjay Raut : ఇద్దరిని ప్రధానులుగా చేయాలా.. నలుగురిని చేయాలా అన్నది మా ఇష్టం

ఇక, అమేథీలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు మే 3వ తేదీ చివరి రోజు.. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అమేథీలో పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అమేథీ నియోజకవర్గం చాలా కాలంగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. కానీ, 2019లో రాహుల్‌ గాంధీని స్మృతి ఇరానీ ఓడించి.. కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికింది. ఇక, ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు రాహుల్ ట్రై చేస్తున్నట్లు సమాచారం.

Read Also: Priyadarshi :మరో సినిమాతో వచ్చేస్తున్న ప్రియదర్శి.. ఈ సారి కావాల్సినంత థ్రిల్ గ్యారెంటీ.

కాగా, అమేథీతో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించలేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.