Site icon NTV Telugu

Financial Planning: డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నారా..? 50-15-5 ఫైనాన్షియల్ రూల్ పాటిస్తే సరి..!

50 15 5 Financial Rule

50 15 5 Financial Rule

Financial Planning: చాలామందికి ఆర్థిక విషయాల్లో అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఎంతోమంది వారు సంపాదించిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి..? ఎలా వాడుకోవాలి..? అనే విషయాలు తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఓ ఫైనాన్షియల్ రూల్ బాగా వైరల్ గా మారింది. అదే 50-15-5 రూల్. ఇందులో మనం సంపాదించిన డబ్బులు ఎలా ఖర్చు చేయాలి..? ఎలా సేవ్ చేయాలో ఒకసారి వివరంగా చూసేద్దాం.

The Health Risks of Overeating: అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

ఎవరికైనా ఒక సరైన ఫైనాన్షియల్ రోడ్‌మ్యాప్ ఉంటే తప్పు ఆర్థిక నిర్ణయాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికీ ఉపయోగపడుతుంది. మరి ఇందుకోసం 50-15-5 ఫైనాన్షియల్ రూల్ లో మీ ఆదాయంలో 50% తప్పనిసరి ఖర్చులకు (ఇల్లు అద్దె, కరెంట్, నీరు వంటివి), 15% రిటైర్మెంట్ సేవింగ్స్‌కు, 5% అత్యవసర అవసరాల కోసం (ఎమర్జెన్సీ ఫండ్) కేటాయించాలి.

ఇలా కేటాయించిన తర్వాత ఇంకా 30% ఆదాయం మిగులుతుంది. దీన్ని మీరు మీ ఇష్టానుసారం ఖర్చు చేయవచ్చు. ప్రతి రూపాయిని ట్రాక్ చేయడం చాలా మందికి కష్టం కాబట్టి, ఈ 30% స్వేచ్ఛతో ఖర్చు చేసే అవకాశం ఇవ్వడం వలన ఆర్థిక నియంత్రణతో పాటు మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది. నిజానికి సాధారణంగా ఫైనాన్షియల్ అడ్వైజర్లు సూచించే బడ్జెట్ విధానం 50-30-20 రూల్. ఇది చూడటానికి 50/15/5 రూల్‌కు భిన్నంగా అనిపించినా, లక్ష్యం మాత్రం రెండింట్లోనూ ఒకటే.

AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?

50-30-20 రూల్ లో 50% అవసరాలు (Needs), 30% కోరికలు, 20% సేవింగ్స్ (ఎమర్జెన్సీ ఫండ్‌తో సహా) ఉంటాయి. చివరికి రెండూ కూడా 50% అవసరాలకు, 30% ఇష్టానుసార ఖర్చులకు, 20% సేవింగ్స్‌కు కేటాయిస్తాయి. అయితే కొందరు ఆర్థిక నిపుణులు ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలని భావిస్తారు. అటువంటి వారి దృష్టిలో 30%ను ఓపెన్‌గా వదిలేయడం సరైనది కాదని భావిస్తారు.

Exit mobile version