Site icon NTV Telugu

Amazon Prime Day 2025: స్మార్ట్ టీవీలపై క్రేజీ డీల్స్.. సగం ధరకే.. ఇప్పుడు కొంటె వేలల్లో లాభం!

Amazon

Amazon

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది. జూలై 12 నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే 2025 సేల్ ప్రారంభం కానుంది. జూలై 14 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సందర్భంగా, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, అనేక ఇతర గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. సేల్‌కు ముందు, కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను కూడా ఆవిష్కరించింది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై కూడా క్రేజీ ఆఫర్‌లు ఉంటాయని కంపెనీ షేర్ చేసిన టీజర్ చూపిస్తుంది.

Also Read:Air India Crash: ఇంజన్ “ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌” తప్పిదమే ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణమా.?

జూలై 12 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సేల్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే. మీరు కూడా కొత్త టీవీ కొనాలని ఆలోచిస్తుంటే, మీరు ఈ సేల్‌ను మిస్ చేసుకోకండి. సగం ధరకే టీవీలు అందుబాటులో ఉండబోతున్నాయి. ఇప్పుడు కొంటె వేలల్లో లాభం పొందొచ్చు. ఈసారి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో 55 అంగుళాల స్మార్ట్ టీవీలపై అతి భారీ డిస్కౌంట్‌ను చూడవచ్చు. కంపెనీ కొన్ని ఉత్తమ 55 అంగుళాల స్మార్ట్ టీవీ డీల్‌లను కూడా వెల్లడించింది. ఈ సేల్‌లో ఎల్‌జి, శామ్‌సంగ్, టిసిఎల్, సోనీ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌లు ఉంటాయని కంపెనీ షేర్ చేసిన డీల్స్ చూపిస్తున్నాయి.

Also Read:Assistant Commandant Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్.. నెలకు రూ. 1.2 లక్షల జీతం

ఈ సేల్‌లో LG బ్రాండ్ కు చెందిన 55 అంగుళాల OLED B4 సిరీస్ 4K టీవీని రూ. 1 లక్ష 15 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో, టీవీ ధర మరింత తక్కువగా ఉండవచ్చు. ఈ సేల్‌లో శామ్‌సంగ్ 55 అంగుళాల విజన్ AI 4K అల్ట్రా HD టీవీని కూడా రూ.50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, TCL 164 cm (65 అంగుళాలు) 4K UHD స్మార్ట్ QD-Mini LED టీవీని కూడా ఈ సేల్‌లో అత్యల్ప ధరకు కొనుగోలు చేయవచ్చు.

Also Read:Bangladesh: ఆందోళనకారుల్ని “కాల్చి వేయాలని” షేక్ హసీనా ఆదేశాలు..

టీజర్ పోస్ట్ చూస్తే దీని ధర రూ.70,000 కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. సోనీ బ్రావియా 55 అంగుళాల XR సిరీస్ 4K స్మార్ట్ టీవీ కూడా ఈ సేల్‌లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరకు లభిస్తుంది. శామ్సంగ్ టీవీలపై 40% వరకు తగ్గింపు లభిస్తుందని వెల్లడించింది. అయితే, TCL టీవీలపై కనీసం 45% తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, Xiaomi టీవీలు ఈ సేల్‌లో సగం ధరకు అంటే 50% వరకు తగ్గింపుకు లభిస్తాయి.

Also Read:Assistant Commandant Recruitment 2025: ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాబ్స్.. నెలకు రూ. 1.2 లక్షల జీతం

ఆపిల్ టెక్ డీల్‌లను చూసినట్లైతే.. ఆపిల్ ఐఫోన్ 15 (128GB) ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా రూ. 60,200 ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ వాచ్ సిరీస్ 10 (46mm, GPS) పై 28% తగ్గింపుతో లభిస్తుంది. ఇందులో జెట్-బ్లాక్ అల్యూమినియం కేస్, అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. 8.3-అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ మినీ (128GB, A17 ప్రో) ఇప్పుడు 23% తగ్గింపుతో లభిస్తుంది.

Exit mobile version