Small Girl helping Blind Beggar: కొంత మంది చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచే తమ మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. వారికి ఎటువంటి కల్మషం ఉండదు. డబ్బున్నా లేకపోయినా, నిరుపేదలైనా, బిచ్చగాలైనా వారు బేధభావం చూపరు. ఓ చిన్నారి అంధుడైనా బిచ్చగాడికి సాయం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసో అంటూ పొగడ్తలతో ముచ్చెత్తుతున్నారు. పిల్లలను ఇలాగే పెంచాలని, పాప తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే తనకు చాలా మంచి అలవాట్లు నేర్పుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Dog skateboarding: స్కేటింగ్ చేస్తున్న కుక్క .. మధ్యలో టాయిలెట్ వస్తే ఏం చేసిందంటే?
వైరల్ అవుతున్న వీడియో స్కూల్ కు వెళ్లే ఓ చిన్నారి అంధుడైన ఓ బిచ్చగాడి దగ్గరకు వెళ్లి డబ్బులు ఇస్తుంది. తరువాత ఆ బిచ్చగాడు పాపను ఏదో అడుగుతాడు. పాప వెంటనే తన టిఫిన్ బాక్స్ తీసి అందులో ఉన్న స్నాక్స్ అతనికి ఇస్తుంది. అయితే వాటి కవర్ తీయడానికి అతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీనిని గమనించిన పాప వాటి కవర్ తీయడమే కాకుండా అతని నోట్లో కూడా తినమని పెడుతుంది. తరువాత తన వాటర్ బాటిల్ తీసి అతనికి ఇస్తుంది. తరువాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మధ్యలో అక్కడ ఉన్న వారు పాపను ఏవో అడుగుతారు కూడా. అయితే అక్కడ కొద్దిగా దూరంలో కారులో ఉన్న కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియో చూసిన వారు పాపను దైవ దూతగా అభివర్ణిస్తున్నారు. ఆ పాపకు దేవుడు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో లో ఆ పాప అలా చేయడం చూస్తుంటే మాత్రం మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది.