NTV Telugu Site icon

Gas Cylinder: దారుణం.. మరోసారి రైలు ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్..

Train

Train

Gas Cylinder on railway track: ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో మరోసారి రైలు దుర్ఘటనకు కుట్ర పన్నిన ఘటన వెలుగు చూసింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్ కనుగొనబడింది. ఒకవేళ ఆ గ్యాస్ సిలిండర్ ను ఢీకొంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం రైల్వే ట్రాక్‌పై ఎల్‌పీజీ సిలిండర్‌ను ఉంచారు. దీంతో పాటు రైల్వే లైన్ సమీపంలో పెట్రోల్, గన్‌ పౌడర్‌ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ప్రకారం, ఉత్తర మధ్య రైల్వేలోని ప్రయాగ్‌ రాజ్ డివిజన్‌ లోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ పై ఎల్‌పిజి చిన్న సిలిండర్ కనుగొనబడింది. గూడ్స్ రైలు ఇక్కడి నుంచి వెళ్లబోతుండగా.. లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Devara : దేవర సెకండ్ ట్రైలర్ ఆలస్యం.. కారణం ఏంటంటే..?

రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ దొరికిన ప్రదేశం కాన్పూర్ దేహత్ జిల్లాలో ఉంది. రైల్వే ట్రాక్‌పై 5 కిలోల కెపాసిటీ గల ఎల్‌పిజి ఖాళీ సిలిండర్‌ను ఉంచినట్లు గుర్తించామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఎస్పీ తెలిపారు. ఆ సమయంలో రైలు వేగం చాలా నెమ్మదిగా ఉందని తెలిపారు. సిలిండర్‌ను చూసిన లోకో పైలట్‌ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి అధికారులకు సమాచారం అందించాడు. ఈ విషయమై ఆర్పీఎఫ్ దర్యాప్తు ప్రారంభించింది. అంతేకాకుండా, స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. గత సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కాన్పూర్‌ లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలును పేల్చివేసేందుకు పన్నినట్లు వెల్లడైంది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రాక్‌పై ఉంచిన ఎల్‌పీజీ గ్యాస్‌ నింపిన సిలిండర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత పెద్ద శబ్ధం కూడా వచ్చింది. అంతేకాదు ఘటనా స్థలంలో పెట్రోల్ నింపిన బాటిల్, గన్‌పౌడర్‌తో పాటు అగ్గిపుల్లలు కూడా లభ్యమయ్యాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. దీంతో పాటు యూపీ ఏటీఎస్, పోలీసులు, జీఆర్పీ కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Atrocious: హైదరాబాద్ లో దారుణం.. ట్రావెల్ బస్సులో వివాహితపై అత్యాచారం..

ఈ ఘటన జరిగిన వెంటనే సెప్టెంబర్ 10న రాజస్థాన్‌ లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును బోల్తా కొట్టించే కుట్ర వెలుగులోకి వచ్చింది. అజ్మీర్‌ లోని సర్ధానాలో రైల్వే ట్రాక్‌పై సుమారు 70 కిలోల బరువున్న రెండు సిమెంటు బ్లాకులను ఉంచి గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ రైలు సిమెంట్ దిమ్మెలను పగులగొట్టి ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.