NTV Telugu Site icon

SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్‌ సొంతం!

Chamari Athapaththu

Chamari Athapaththu

Chamari Athapaththu Century Helps SLW Won 3rd ODI vs NZW: న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో లంక 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్‌ విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది. 2008లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఈ 15 ఏళ్లలో ఏ ప్రత్యర్థిపైనైనా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో గెలవడం లంకకు ఇది తొలిసారి. దాంతో న్యూజిలాండ్‌పై శ్రీలంక మూడో వన్డేలో చారిత్రక విజయం అందుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో బంగ్లాదేశ్‌పై 3 మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక విజయం సాధించింది. అయితే అది 1-0 తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. న్యూజిలాండ్‌పై శ్రీలంక వన్డే సిరీస్ సాధించడంలో శ్రీలంక కెప్టెన్‌ చమారీ ఆటపట్టు కీలక పాత్ర పోషించింది. మూడో వన్డేలో ఆటపట్టు అద్భుత శతకంతో (140 నాటౌట్‌; 80 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగింది. తొలి వన్డే మ్యాచ్‌లో కూడా చమారీ సెంచరీ (108 నాటౌట్‌) చేసింది. దాంతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా దక్కింది.

వర్షం అంతరాయాల మధ్య సాగిన మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సుజి బేట్స్‌ (63 నాటౌట్‌; 87 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (38 నాటౌట్‌; 48 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఈ సమయంలో వర్షం పడింది. దాంతో అంపైర్లు శ్రీలంకకు 29 ఓవర్లలో 196 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఛేదనలో చమారీ ఆటపట్టు ధాటిగా ఆడుతూ 60 బంతుల్లోనే సెంచరీ చేసింది. నిలక్షి డిసిల్వ (48 నాటౌట్‌) కూడా రాణించడంతో శ్రీలంక మరో 13 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

Also Read: BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!

Also Read: Vegetable Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!

Show comments