NTV Telugu Site icon

SLBC Tunnel: చివరి దశకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా లభించని ఆరు మృతదేహాలు

Tunnel

Tunnel

SLBC Tunnel: ఎస్ఎల్‌బిసి (SLBC) టన్నెల్ విషాద ఘటన అందరికి తెలిసిన విషయమే. టన్నెల్ లో పనులు చేస్తున్న కార్మికులు లోపల చిక్కుకుపోయి ఎనిమిది మూర్తి చెందారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 53 రోజులుగా సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఆరుగురు మృతదేహాల ఆచూకి లభించకపోవడం విచారకరం. టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, టిబియం (TBM) శకలాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలిస్తూ రెస్క్యూ బృందాలు శ్రమించుతున్నాయి.

అయితే, చివరి 20 మీటర్ల పరిధిలో మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని D1 ప్రదేశంలో నిపుణుల సూచనలతో మట్టి తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో అనేక సాంకేతిక పరికరాలు, నిపుణుల మద్దతుతో బృందాలు పనిచేస్తున్నాయి. బాధిత కుటుంబాల కోరిక మేరకు రెస్క్యూ సభ్యులు మరింత జాగ్రత్తగా మట్టిని తొలగిస్తూ చివరి వరకు ఆశను కోల్పోకుండా ప్రయత్నిస్తున్నారు.