SL vs IND: తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమయ్యారు. వారి ఇన్నింగ్స్ లో హసిని పెరెరా (25), ఇమేషా దులానీ (27) మాత్రమే కొంత పోరాటం చేశారు. మిగితా వారి నుంచి వారికి మద్దతు దొరకలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంక బ్యాటింగ్‌ను కట్టడి చేసింది. ఆమెకు తోడుగా ఆల్ రౌండర్ దీప్తి శర్మ 3 వికెట్లు తీసింది.
Emmanuel Love: గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. అమ్మాయి ఎవరంటే..?
ఇక 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. షఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. షఫాలీ కేవలం 42 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరానికి చేర్చింది. భారత ఇన్నింగ్స్ లో స్మృతి మంధన 1 పరుగు, జెమ్మియా 9 పరుగులతో నిరాశ పరిచారు. ఇక షఫాలీ వర్మ ఒకవైపు వికెట్లు పడుతున్న అవేమి పట్టనట్లుగా తనదైన దూకుడును చూపించింది. ఒకానొక సమయంలో జట్టు స్కోర్ 55 పరుగులు కాగా.. అందులో షఫాలీ ఒక్కటే 50 పరుగులు చేసింది. ఇక చివరిలో షఫాలికి తోడుగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్ 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 40 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Google Notebook : గూగుల్ నోట్‌బుక్‌లో సరికొత్త ‘లెక్చర్ మోడ్’..
