NTV Telugu Site icon

Skoda Slavia: అమ్మకాలలో ఈ కారు నెంబర్-1..

Skoda

Skoda

భారతీయ కస్టమర్లలో భద్రతకు ప్రసిద్ధి చెందిన స్కోడా.. గత నెల మే 2024లో కార్ల విక్రయాల డేటాను విడుదల చేసింది. గత నెలలో స్కోడా స్లావియా అమ్మకాలలో అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,538 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాది 2023 మేలో స్కోడా స్లావియా మొత్తం 1,695 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. అయితే.. గతేడాదితో పోల్చుకుంటే.. వార్షిక ప్రాతిపదికన 9.26 శాతం క్షీణించాయి. మరోవైపు.. కంపెనీ మొత్తం కార్ల విక్రయాలలో స్కోడా స్లావియా మాత్రమే 53.33 శాతం వాటా కలిగి ఉంది. భద్రత విషయంలో స్కోడా స్లావియాకు గ్లోబల్ NCAP 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. గత నెలలో కంపెనీ రెండవ మోడల్ అమ్మకాలు ఎలా జరిగాయో తెలుసుకుందాం.

YS Jagan Pulivendula Tour: ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వైయస్ జగన్

కంపెనీలో విక్రయాల జాబితాలో స్కోడా కుషాక్ రెండో స్థానంలో ఉంది. స్కోడా కుషాక్ గత నెలలో మొత్తం 1,157 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాది.. ఈ కంపెనీ 1,685 యూనిట్ల కార్లను విక్రయించింది. గతేడాదితో పోల్చుకుంటే స్కోడా అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 31.34 శాతం క్షీణించాయి. మరోవైపు.. విక్రయాల జాబితాలో స్కోడా కొడియాక్ మూడవ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 150 యూనిట్ల స్కోడా కొడియాక్ కార్లను అమ్మారు. ఈ కార్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 17 శాతం పెరిగాయి. మరోవైపు.. విక్రయాల జాబితాలో స్కోడా సూపర్బ్ నాల్గవ స్థానంలో ఉంది. స్కోడా సూపర్బ్ వార్షిక ప్రాతిపదికన 60 శాతం క్షీణతతో కేవలం 4 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించింది.

Kejriwal: హైకోర్టు తీర్పుపై పెట్టుకున్న కేజ్రీవాల్ అభ్యర్థన తిరస్కరణ

కారు పవర్ ట్రెయిన్
పవర్ ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే.. స్కోడా స్లావియాలో 1.0-లీటర్ TSI ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 178 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. అంతేకాకుండా.. ఈ కారులో 1.5-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ అందిస్తుంది. ఇది గరిష్టంగా 150bhp శక్తిని, 250 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు.. కారు ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్లను ఇచ్చారు. స్కోడా స్లావియా లీటరుకు గరిష్టంగా 19.47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

స్కోడా స్లావియా ఫీచర్లు
కారు లోపల భాగంలో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, 8 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, సన్ రూఫ్, వెంటలిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం కారులో 6 ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్ కూడా ఉన్నాయి.

స్కోడా స్లావియా ధర
స్కోడా స్లావియా మార్కెట్ లో మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాలతో పోటీ పడుతుంది. స్కోడా స్లావియా ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర టాప్ మోడల్ కోసం రూ. 11.53 లక్షల నుంచి రూ. 19.13 లక్షల వరకు ఉంది.