Skin Will Stay Young : వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి ఒక్కరికి కాలంతో పాటు వయస్సుతో మీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ., కొన్నిసార్లు ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. దీనిని అకాల వృద్ధాప్యం అంటారు. దీనికి కారణాలు చెడు జీవనశైలి, పర్యావరణ కారణాలు. అకాల వృద్ధాప్యం అంటే కనపడే అత్యంత సాధారణ లక్షణాలు ముడతలు, వయస్సు మచ్చలు, పొడిబారడం లేదా చర్మపు రంగులో మార్పు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఈ లక్షణాలను అకాలంగా సంభవించకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
షుగర్:
షుగర్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. రావాల్సిన వయసు కంటే ముందే మిమ్మల్ని వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తుంది. అందువల్ల 25 సంవత్సరాల వయస్సు తర్వాత మీరు మీ ఆహారం నుండి చక్కెర తీసుకోవడం పరిమితం చేయాలి. ఇది శరీరానికి కూడా చాలా హానికరం.
ధూమపానం:
స్మోకింగ్ లో ఉండే నికోటిన్ శరీరంతో పాటు చర్మ కణాలకు కూడా చాలా హానికరం. ఇది మీ కణాలను వేగంగా దెబ్బతీస్తుంది. దీని కారణంగా అవి నిర్జీవంగా మారడం ప్రారంభిస్తాయి. దీని కారణంగా మీరు సమయం కంటే ముందే వృద్ధాప్యంగా కనిపించడం ప్రారంభిస్తారు.
కార్బోహైడ్రేట్లు:
చక్కెరతో పాటు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం కూడా వేగంగా వృద్ధాప్యానికి కారణం. పిజ్జా, బర్గర్లు, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి పిండితో తయారు చేసిన వాటిని తీసుకోవడం వల్ల మీరు సమయం కంటే ముందే వృద్ధాప్యానికి గురవుతారు.
ఆల్కహాల్:
అధిక ఆల్కహాల్ చర్మాన్ని త్వరగా వృద్ధాప్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే., ఆల్కహాల్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది వృద్ధాప్య లక్షణాలకు దారితీస్తుంది. ఎక్కువసేపు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మం పాతబడి నిర్జీవంగా మారుతుంది.
నిద్ర లేకపోవడం:
నిద్రపోతున్నప్పుడు, శరీరం చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. నిద్ర లేకపోవడం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే అకాల వృద్ధాప్య సమస్య మొదలవుతుంది. ఇది శరీరంపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. రోజువారీ అలసట నుండి కోలుకోవడం కష్టతరం చేస్తుంది. నిద్ర మీ జీవక్రియను చక్కగా ఉంచుతుంది. తద్వారా మీ శరీరం సరిగ్గా పనిచేస్తుంది.