NTV Telugu Site icon

Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..

Whatsapp Image 2023 09 24 At 11.12.32 Am

Whatsapp Image 2023 09 24 At 11.12.32 Am

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసే సినిమాల కు  అదిరిపోయే మ్యూజిక్ తో పాటు బ్యాండ్ పగిలేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఇస్తుంటారు. మరీ ముఖ్యం గా థమన్ బాలయ్య నటించిన అఖండ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ అమెరికా థియేటర్ స్పీకర్స్ బద్ధలేయిపోయాయి. దీనిని బట్టి చెప్పొచ్చు థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో.తన మ్యూజిక్ తో అందరి చేత డాన్స్ చేయిస్తాడు.ప్రస్తుతం టాలీవుడ్‌ లో థమన్‌ హవా సాగుతుంది.పాటలు కాస్త ఓకే అనిపించినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ పరంగా థమన్‌ అదరగోడుతున్నాడు. అఖండ సినిమా అంత పెద్ద హిట్టవ్వడానికి మేయిన్‌ రీజన్‌ బాలయ్య ఎలివేషన్ సీన్స్ కు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణం.ఇక ఆమధ్య అలవైకుంఠపురం లో ఈ రేంజ్‌ బ్లక్‌ బస్టర్‌ అవడానికి కారణం కూడా థమనే మ్యూజిక్ అని చెప్పొచ్చు..

ఇక తాజాగా థమన్‌ సంగీతం అందించిన స్కంద రిలీజ్‌ కు సిద్ధం గా ఉంది. ఇక రామ్ పోతినేని హీరో గా నటిస్తున్న ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. స్కంద సినిమా ఈనెల 28 వ తేదీన రిలీజ్ కాబోతోంది. దీనితో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌లు జోరుగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా రామ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో తెగ సందడి చేస్తున్నాడు. ఈ క్రమం లో స్కంద మ్యూజిక్‌ గురించి మాట్లాడుతూ థమన్‌ ను ఓ రేంజ్‌ లో పొగిడేసాడు.. స్కంద సినిమా కు థమన్‌ ఇచ్చిన మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంటుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ గూస్‌బంప్స్‌ వస్తాయని తెలిపాడు.థమన్‌ మ్యూజిక్‌ కు స్పీకర్స్‌ బ్లాస్ట్‌ అవడం పక్కా అని థియేటర్‌ ఓనర్లు మళ్లీ కొత్తగా రెనోవేట్‌ చేసుకోవాల్సిందే అని తెలిపాడు.

Show comments