NTV Telugu Site icon

Skanda : అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ రిలీజ్ కాబోతున్న స్కంద…?

Whatsapp Image 2023 10 22 At 3.24.55 Pm

Whatsapp Image 2023 10 22 At 3.24.55 Pm

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను ఊర మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను తెరకేక్కించారు.పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో యంగ్ సెన్సేషన్‌ శ్రీలీల మరియు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్‌, ప్రభాకర్‌, గౌతమి మరియు ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.   ట్రైలర్‌ తో విడుదలకు ముందే హైప్‌ సొంతం చేసుకున్న స్కంద సెప్టెంబర్‌ 28న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. పాజిటివ్‌ రివ్యూస్‌తో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంది. రామ్‌ స్కంద సినిమాలో మొదటిసారిగా ఊర మాస్‌ హీరోగా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక బోయపాటి మార్క్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ రామ్‌ పోతినేని డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ. 35 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.కాగా థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 27 నుంచే స్కంద డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈమూవీని స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్కంద సినిమాకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌. థమన్‌ స్వరాలు సమకూర్చారు. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెలా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ గ్రాండ్ గా ఈ సినిమాను నిర్మించారు.