Site icon NTV Telugu

Jayashankar Bhupalpally: గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

Godawari

Godawari

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ (మ) అంబట్ పల్లి వద్ద ఆరుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీం సభ్యులు గజఈతగాళ్లు ,కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ,గోదావరి నీటిలోకి దిగి అంచనా వేశారు. కాగా నది లోపల బోట్స్ తిరిగే అవకాశం లేకపోవడంతో రాత్రి అంతగా సేఫ్ కాదని భావించారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాక బృందాలు వెనుతిరిగాయి.

Also Read:Maganti Gopinath: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత..

శనివారం రాత్రి గాలింప చర్యలు ముందుకు సాగలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు నది వద్దనే తమ పిల్లల ఆచూకీ గురించి ఎదురుచూస్తూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయారు. గోదావరి నదిలో నిన్న గల్లంతైన ఆరుగురి యువకుల కోసం నేడు ఉదయం రెండు స్పీడ్ బొట్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎస్డీఆర్ఎఫ్,సింగరేణి రెస్క్యూ,ఫైర్ బృందాలు. గాలింపు చర్యల్లో రక్షిత్ మృతదేహం లభ్యం అయ్యింది. మరో ఐదుమంది యువకుల కోసం గాలింపు చేపడుతున్నారు. యువకుల గల్లంతుతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది.

Exit mobile version