NTV Telugu Site icon

Mexico: మెక్సికోలోని ఓ బార్ లో కాల్పులు.. ఆరుగురి మృతి

Gun Fire

Gun Fire

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టిచింది. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్‌లో తుపాకుల మోత మోగడంతో.. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది ముఠా హింసతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతమని జాలిస్కో పోలీస్ అధికారులు తెలిపారు. మెక్సికన్ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం అర్థరాత్రి టియోకల్టిచే నగరంలో ఈ సంఘటన జరిగిందని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Central Government Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..పోస్టుల వివరాలు ఇవే..

బార్‌లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారనీ, ఈ సమయంలో కొంతమంది దుండగులు తుపాకులు పట్టుకుని వచ్చి.. విచక్షణరహితంగా కాల్పులు జరిపారని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. మారావిల్లాస్ పరిసరాల్లోని బార్‌లో పలువురు వ్యక్తులు కాల్పులు జరిపారనీ.. ఈ సంఘటనలో ఆరుగురు మరణించారని పేర్కొంది.
వాస్తవానికి నాలుగు మరణాలను అధికారులు నివేదించారు.. అయితే, ప్రాసిక్యూటర్లు నిన్న (శనివారం) ఆరుగురు మరణించినట్లు ధృవీకరించారు. మెక్సికోలోని అతిపెద్ద క్రిమినల్ గ్రూపుల్లో ఒకటైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌తో ముడిపడి ఉన్న హింసతో జాలిస్కో అల్లాడిపోయింది.

Read Also: Food Varieties: CWC గెస్టుల కోసం నోరూరించే వంటకాలు.. బిర్యానీతో సహా 78 వెరైటీలు..!

జాలిస్కో రాజధాని గ్వాడలజారాకు ఉత్తరాన ఉన్న టియోకల్టిచేలో ఈ నెల ప్రారంభంలో మరో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారు. 2006 చివరిలో సమాఖ్య ప్రభుత్వం సైనిక మద్దతుతో మాదక ద్రవ్యాల వ్యతిరేక దాడిని ప్రారంభించినప్పటి నుంచి 3 లక్షల 40 వేల మంది కంటే ఎక్కువ హత్యలు జరిగాయి.. దాదాపు లక్ష మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం నేర సంస్థలతో ముడిపడి ఉన్నాయని జాలిస్కో ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

Show comments