Site icon NTV Telugu

Ayalaan : అయలాన్ కోసం భారీ రెమ్యూనరేషన్ వదులుకున్న శివకార్తికేయన్..

Whatsapp Image 2023 12 27 At 1.36.38 Pm

Whatsapp Image 2023 12 27 At 1.36.38 Pm

శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు.100 కోట్ల భారీ బడ్జెట్ తో 2016లో అయలాన్‌ సినిమాను అనౌన్స్ చేశారు. 2018 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్‌, వీఎఎఫ్ఎక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడం తో బడ్జెట్ బాగా పెరిగిపోయింది.దీనితో అయలాన్‌ రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఈ మూవీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కాగా అయలాన్ మూవీ కోసం శివకార్తికేయన్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట… ఈ విషయాన్ని మంగళవారం జరిగిన అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో సినిమా యూనిట్ స్వయం గా వెల్లడించింది.

అయలాన్ కథ శివకార్తికేయన్‌కు ఎంతగానో నచ్చిందని, దర్శకుడి విజన్‌, సినిమా కోసం యూనిట్ పడుతోన్న కష్టం ప్రేక్షకులకు చేరువ కావాలనే అతడు ఉచితంగా అయలాన్‌లో నటించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస హిట్స్‌తో తమిళంలో దూసుకుపోతున్నాడు.ఈ హీరో ఒక్కో సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయలాన్ కోసం శివకార్తికేయన్ భారీ రెమ్యునరేషన్‌ను వదులుకోవడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.అయలాన్ సినిమా ఎలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఇందులో ఎలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాకు సిద్ధార్థ్ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగానే డబ్బింగ్ చెప్పాడని సమాచారం.. ఈ విషయాన్ని అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో శివకార్తికేయన్ స్వయంగా తెలిపారు.అయలాన్ సినిమాలో పొగ మరియు మద్యం తాగే సన్నివేశాలతో పాటు వయోలెన్స్ తో కూడిన సీన్ ఒక్కటి కూడా ఉండదని శివకార్తికేయన్ తెలిపారు.. అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.ఈ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Exit mobile version