Ayalaan : అయలాన్ కోసం భారీ రెమ్యూనరేషన్ వదులుకున్న శివకార్తికేయన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో డైరెక్టర్ ఆర్ రవి కుమార్ అయలాన్ మూవీని తెరకెక్కించాడు.100 కోట్ల భారీ బడ్జెట్ తో 2016లో అయలాన్ సినిమాను అనౌన్స్ చేశారు. 2018 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. గ్రాఫిక్స్, వీఎఎఫ్ఎక్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న కథ కావడం తో బడ్జెట్ బాగా పెరిగిపోయింది.దీనితో అయలాన్ రిలీజ్ ఆలస్యమైంది. దాదాపు ఐదేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఈ మూవీ ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కాగా అయలాన్ మూవీ కోసం శివకార్తికేయన్ రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట… ఈ విషయాన్ని మంగళవారం జరిగిన అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో సినిమా యూనిట్ స్వయం గా వెల్లడించింది.
అయలాన్ కథ శివకార్తికేయన్‌కు ఎంతగానో నచ్చిందని, దర్శకుడి విజన్, సినిమా కోసం యూనిట్ పడుతోన్న కష్టం ప్రేక్షకులకు చేరువ కావాలనే అతడు ఉచితంగా అయలాన్‌లో నటించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం శివకార్తికేయన్ వరుస హిట్స్‌తో తమిళంలో దూసుకుపోతున్నాడు.ఈ హీరో ఒక్కో సినిమా కోసం 25 నుంచి 30 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయలాన్ కోసం శివకార్తికేయన్ భారీ రెమ్యునరేషన్‌ను వదులుకోవడం కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.అయలాన్ సినిమా ఎలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. ఇందులో ఎలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమాకు సిద్ధార్థ్ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉచితంగానే డబ్బింగ్ చెప్పాడని సమాచారం.. ఈ విషయాన్ని అయలాన్ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో శివకార్తికేయన్ స్వయంగా తెలిపారు.అయలాన్ సినిమాలో పొగ మరియు మద్యం తాగే సన్నివేశాలతో పాటు వయోలెన్స్ తో కూడిన సీన్ ఒక్కటి కూడా ఉండదని శివకార్తికేయన్ తెలిపారు.. అయలాన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.ఈ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!