Sivaji 90s Web Series : శివాజీ నైంటీస్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషించాడు.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ భార్య గా నటించింది… ఇందులో మ్యాథ్స్ టీచర్ చంద్రశేఖర్ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా, అతని భార్య శోభారాణి పాత్రలో నటి వాసుకీ కనిపించనుంది. ‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్ ఉంటారు. అలాంటి మ్యా్థ్స్ టీచరే ఈ మన చంద్ర శేఖర్’ అంటూ శివాజీ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు . ‘ఇక మిసెస్ శోభారాణితో అంత ఈజీ కాదు. స్ట్రిక్ట్ మ్యాథ్స్ టీచర్నే షేక్ చేసే శోభారాణి. దీపావళికి కలుద్దాం’ అంటూ నటి వాసుకీ లుక్‌ను కూడా విడుదల చేశారు.
వనపర్తి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.నైంటీస్ వెబ్ సిరీస్‌కు ఆదిత్య హసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాసంతిక మచ్చ, మౌళి, స్నేహల్ కామత్ మరియు రోహన్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. అజీమ్ మొహమ్మద్ కెమెరామెన్‌గా మరియు గాంధీ నడికుడియార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.అలాగే షర్వీన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయనున్నారు. కాగా తొలిప్రేమ తో క్రేజ్ తెచ్చుకున్న వాసుకీ ఇటీవలే అన్ని మంచి శకునములే తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీని తర్వాత తమిళ్లో కూడా ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు నైంటీస్ వెబ్ సిరీస్‌తో మరోసారి మనల్ని అలరించేందుకు సిద్ధమైంది. నైంటీస్ వెబ్‌సిరీస్ ను దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ ప్రకటించింది.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!