Siva karthikeyan: 21 ఏళ్లుగా జ్ఞాపకాలు.. ఆయన కోసమే ‘అమరన్’ సినిమా చేశా!
- శివ కార్తికేయన్ తాజాగా నటించిన చిత్రం అమరన్
- ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూల్
- తండ్రి కోసమే అమరన్ చేశానన్న శివ
17 ఏళ్ల వయసులోనే తన తండ్రి దూరమైనట్లు, అప్పటినుంచి ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నట్లు హీరో శివ కార్తికేయన్ తెలిపారు. తన తండ్రి మరణించిన అనంతరం తాను ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ‘అమరన్’ సినిమా చేయడానికి ప్రధాన కారణం తన తండ్రే అని భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, తన నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్. అక్టోబర్ 31న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూల్ చేసింది.
అమరన్ విజయోత్సవ సభలో శివ కార్తికేయన్ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ… ‘మా నాన్న నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్. ప్రతిఒక్కరు ఆయనను ఎంతో గౌరవించేవారు. అమరన్ చేయడానికి ప్రధాన కారణం నాన్నే. గత 21 ఏళ్లుగా నేను ఆయన జ్ఞాపకాలతో బతుకుతున్నా. అమరన్‌లో నేను మా నాన్నను చూసుకున్నా. నా మొదటి హీరో నాన్నే. చిన్నపుడు నాన్న షూ పాలిష్ చేయడం, బ్యాడ్జీ సిద్ధం చేసేవాడిని. అమరన్‌లో ఆయన లానే నటించా. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, మా నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయి’ అని తెలిపారు.
Also Read: IPL Auction 2025: మెగా వేలంలో భారత స్టార్ ఆటగాళ్లు.. కనీస ధర ఎంతంటే?
‘నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న మరణించారు. 2 రోజుల సెలవుపై ఇంటికి వస్తానని నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. చివరకు అంబులెన్స్‌లో ఐస్ బాక్స్‌లో ఇంటికి వచ్చారు. అంత్యక్రియలు అయ్యాక ఆయన ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని చూసి నా గుండె బద్దలైంది. ఎంతో ఏడ్చాను. అప్పటినుంచి నాన్న జ్ఞాపకాలతో జీవిస్తున్నా’ అని శివ కార్తికేయన్ చెప్పారు. శివ కార్తికేయన్ తండ్రి పేరు జి దాస్. ఆయన జైలు సూపరింటెండెంట్. శివకు 17 ఏళ్ల వయసు ఉన్నపుడు జి దాస్ మరణించారు.
తాజావార్తలు
-
Rishabh Pant Injury: కుడి చేతికి మరో గాయం అయింది.. ఓటమికి ఏదో కారణం చెప్పడం కష్టం!
-
TGSRTC Strike Alert: 48 గంటల్లో సమ్మె సైరన్ మోగించనున్న RTC ఉద్యోగులు.. సమ్మెను లైట్ తీసుకున్న ప్రభుత్వం.?
-
JR NTR : శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
-
Rashid Khan Citizenship: భారత్ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!
-
Cream Cheese Kunafa Recipe: రెస్టారెంట్స్ లో డబ్బులు వేస్ట్.. ఇంట్లోనే సూపర్ టేస్టీ ‘క్రీమ్ చీజ్ కునాఫా’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!