Site icon NTV Telugu

Ayalaan : శివ కార్తికేయన్ అయాలాన్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Whatsapp Image 2023 10 02 At 6.57.44 Pm

Whatsapp Image 2023 10 02 At 6.57.44 Pm

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రీసెంట్ గా వచ్చిన మహావీరుడు సినిమా తో మంచి విజయం అందుకున్నాడు. శివ కార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అయలాన్‌’..తమిళంలో ‘అయలాన్‌’ అంటే ‘ఏలియన్‌’ అని అర్థం.. ఈ సినిమాలో హీరో శివ కార్తికేయన్ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆర్‌.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్‌.రెహమాన్ ఈ సినిమా కు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్‌ రిలీజ్ చేసిన అయలాన్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.శివ కార్తికేయన్‌ ఆకాశం లో విహరిస్తుండగా.. అతడితో పాటే ఏలియన్‌ కూడా వెళ్తున్న లుక్‌ సినిమా పై మరింత ఆసక్తి పెంచుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ టీజర్‌ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.

అయలాన్‌ టీజర్‌ను అక్టోబర్ 06న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనితో పాటు ఒక ఫొటో కూడా విడుదల చేసారు.ఈ ఫొటోలో ఏ.ఆర్‌.రెహమాన్‌ తో పాటు శివకార్తికేయన్, రవికుమార్ మరియు ఏలియన్ టీజర్ కోసం చూస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.సైన్స్ ఫిక్షన్‌ తరహా కథతో రానున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయలాన్‌లో శివకార్తికేయన్, రకుల్‌తో పాటు ఇషా కొప్పికర్, శరద్‌ కేల్కర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌ మరియు బాల శరవణన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.తమిళ్ తో పాటు తెలుగు లో కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో శివ కార్తికేయన్. దీనితో ఆయన నటించిన అయలాన్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version