NTV Telugu Site icon

Viral : మొసలితో ఆట లాడితే అంతే ఉంటది.. మరి

New Project (9)

New Project (9)

Viral : జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో, ఒక వ్యక్తి మొసలి శరీరంపై కూర్చున్నాడు. ఆపై తన చేతిలో ఉన్న వస్తువుతో మొసలి ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియోలో సాహసం, మూర్ఖత్వం అనే రెండు అంశాలు ఉంటాయి.

Read Also: Good News: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫిట్ నెస్ పరీక్ష తేదీని పెంచిన కేంద్రం

జూలాజికల్ మ్యూజియంలో ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తాను ధైర్య వంతుడినని చూపించుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో, చేతి కర్ర లాంటి వస్తువులో మొసలి నోటిపై కొట్టాడు. వెంటనే మొసలి తన నోరు తెరుస్తుంది. అప్పుడు అదే సమయంలో రెండో మొసలి వెనక్కి తిరిగింది. దీంతో భయపడిన వ్యక్తి మొసలిపై నుంచి దిగిపోయాడు. ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు మొసలి ప్రయత్నించింది. అదే సమయంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అతని దృష్టి పూర్తిగా రెండో మొసలిపై ఉంది. ఈ లోగా మొదటి మొసలి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే మనిషి తొడను కొరికేస్తుంది. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments