Site icon NTV Telugu

Sitara-Mahesh Babu: మహేష్ బాబు అసలు సీక్రెట్ చెప్పేసిన సితార!

Sitara Mahesh Babu

Sitara Mahesh Babu

Sitara Ghattamaneni Talks About Mahesh Babu’s Hair: టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్​, రీల్స్ పోస్ట్ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఓవైపు యాడ్‌లలో నటిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్న ఏజ్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి మహేష్ బాబుకు సంబందించిన ఓ సీక్రెట్ బయటపెట్టారు.

ఇటీవల ఓ పెళ్లి వేడుకలో మహేశ్‌ బాబు పాల్గొనగా.. సూపర్ స్టార్ సోదరి మంజుల అతడి జుట్టు పట్టుకుని లాగారు. దానికి మహేశ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో మంజులను మహేశ్‌ను ఏమన్నారో? ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని సితారను అడగ్గా.. జుట్టు పట్టుకోవద్దు అని నాన్న అత్తయ్యతో అన్నారని చెప్పారు. ‘జుట్టును టచ్ చేస్తే నాన్నకు అస్సలు నచ్చదు. కోపం వెంటనే వచ్చేస్తుంది. నేను నాన్న జుట్టును టచ్ చేస్తూ అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ ఉంటా’ సితార చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సితార కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు!

ఈ కార్యక్రమంలోనే సితారని ఏ క్లాస్ చదువుతున్నావు అని అడగ్గా.. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అయిపోయిందని, సెవెంత్‌లోకి వెళ్తాను అని తెలిపారు. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాను ఇంకా చిన్న ఏజ్‌లోనే ఉన్నానని, ఫ్యూచర్‌లో నటిస్తాను అని సీతూ పాప పేర్కొన్నారు. అమ్మ దగ్గర నుంచి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటానని, నాన్న నుంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటానని చెప్పారు. ఇంట్లో అమ్మ, నాన్న ఎవరూ స్ట్రిక్ట్ కాదని సితార నవ్వులు పూయించారు.

Exit mobile version