Minister Harish Rao Comments at Sita Ramachandra Swamy Idol Re-Installed in Valmidi: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం వల్మిడి గ్రామంలోని గుట్టపైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నేడు త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంకు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు.
వల్మిడిలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ‘వాల్మికి మహర్షి పుట్టిన గడ్డకు గొప్ప కీర్తిని తీసుకువచ్చేలా మంత్రి ఎర్రబెల్లి కృషి చేస్తున్నారు. సీతారాములు నడియాడిన నేల, లవకుశులు జన్మించిన పుణ్యభూమిపై రామాలయం నిర్మించడం అభినందనీయం. మునుల గుట్టపై రామానుజన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. వాల్మిడి గుట్టపై రామాలయం ఉంది. ఈ రెండు గుట్టల మధ్య కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. సీఎం కేసీఆర్ నిఖార్సైన హిందూ. గుండెల నిండా భక్తిభావం గల వ్యక్తి. పరిపాలకుడి కృప వల్ల విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… ‘ముఖ్యమంత్రి కేసీఆర్ దైవభక్తుడు. ఆయన నేతృత్వంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.కేసీఆర్ చేసిన చండీయాగంతో వర్షాలు సంవృద్దిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Also Read: Rahkeem Cornwall: 12 సిక్స్‌లతో వీరవిహారం.. 48 బంతుల్లో ‘బహుబలి’ సెంచరీ!
‘వల్మిడి గుట్టపై రాముడి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలపైనే ఆలయం నిర్మించాం. లవకుశులు నడియాడిన నేల ఇది. అయోధ్య, భద్రాచలం మాదిరిగా వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. పాలకుర్తి సోమనాథ్ ల్మక్ష్మీనరసింహా స్వామి ఆలయం, వాల్మిడి రామాలయంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.