Site icon NTV Telugu

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్

Sit

Sit

AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు పూనుకుంది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది.. మరోవైపు.. ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్‌ ఇన్వెస్టిగేట్‌ టీవ్‌ (సిట్‌).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి కారణాలు ఏంటి..? తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది..

Read Also: Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్ రా నాయనా.. చూస్తే ఫ్యాంట్ తడిచిపోవాల్సిందే..

ఇక, తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుడుతున్నారట అధికారులు.. మరోవైపు.. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందంటున్నారు.. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎన్నిలక కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే.. బాధ్యులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) వేటు వేసిన విషయం విదితమే.

Exit mobile version