AP Violence: ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు డీజీపీకి సిట్ సారథి వినీత్ తెలిపారు.
Read Also: CM YS Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్.. నినాదాలు చేసిన అభిమానులు
ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సిట్ ముందు పరిశీలించనుంది. ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా, లేకా సెక్షన్లు మార్చాలా అని సిట్ నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటి వరకు కేసులు పెట్టక పోతే కొత్తగా కేసులు నమోదు చేయించనుంది సిట్ బృందం. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది.