Site icon NTV Telugu

SIT Investigation on Violence: తిరుపతిలో విచారణ వేగం పెంచిన సిట్.. రాత్రి వరకు పూర్తయ్యే అవకాశం

New Project (20)

New Project (20)

తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ కొనసాగుతోంది. మరో రెండు, మూడు గంటలు పాటు విచారణ సాగే అవకాశం ఉంది. దాడి ఘటనపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, దాడి సమయంలోని తీసినా వీడియోలు సిట్ పరిశీలిస్తోంది. చంద్రగిరిలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై సిట్ బృందం విచారణ జరుపుతోంది. మహిళా యూనివర్సిటీ పీఎస్ లో నమోదైన 8 కేసుల వివరాలపై ఆరా తీస్తోంది. పులివర్తి నాని పై దాడి జరిగిన ప్రాంతం సహా కూచువారిపల్లిలో సర్పంచ్ ఇంటిని పరిశీలించింది. గ్రామస్థుల వివరాలు సిట్ సేకరించింది. రామిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ పరిశీలించి గ్రామస్థుల వివరాలు ఆరా తీసింది. తిరిగి మహిళా యూనివర్సిటీకి చేరుకున్న సిట్ బృందం అక్కడ విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు. దాడికి పాల్పడ్డ ఇరు వర్గాల గురించి పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందించనుంది.

READ MORE: Pavithra Naresh: అందుకే పవిత్రని ప్రేమించిన నరేష్.. ఇలా ఓపెన్ అయిపోయాడేంటి?

విచారణ తరువాత ఇవాళ రాత్రికి సిట్ ఐజీకి నివేదిక అందజేయనుంది. కాగా.. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఈ క్రమంలోనే సిట్‌ బృందం వేగంగా విచారణ జరుపుతోంది.

Exit mobile version