Site icon NTV Telugu

Jagtial District: తమ్ముడు ఎన్నికల్లో ఓటమి.. గుండెపోటుతో అక్క మృతి..

Jagitial

Jagitial

Jagtial District: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులను కలచివేసింది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్‌గా పోటీ చేశాడు. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) తాపత్రయ పడింది. ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి చేరుకుంది. నిన్న కౌటింగ్ జారుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మమత.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. ఎన్నికల్లో 187 ఓట్ల తేడాతో ఓడిపోయిన శేఖర్ ఓడిపోయాడు. మమతకు గతంలో గుండెపోటు రావడంతో స్టంట్ వేసినట్లు కుటుంబీకులు తెలిపారు.

READ MORE: Off The Record: కొత్త పంధాలో ఉండవల్లి అరుణ్ కుమార్..? బీజేపీ మీదికి ఫోకస్ షిఫ్ట్..!

Exit mobile version