Site icon NTV Telugu

HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ బావ బలి కోరారు

Murder

Murder

ఆప్యాయతలు.. అనురాగాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. కేవలం పగలు, ప్రతీకారాలు, కుటుంబ కలహాలతో రగిలిపోతూ… చివరకు హత్య చేసే వరకు కూడా వెను కాడడం లేదు. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. సొంత బామ్మర్దులే బావను తీసుకువెళ్లి హత్య చేశారు. హైదరాబాద్‌లో ఓల్డ్ మలక్‌పేట్‌లో జరిగిన హత్య కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి..ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నాడు. రాత్రి సమయంలో ఓల్డ్ మలక్‌పేట్‌లోని వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న తన తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చాడు. అదే సమయంలో సిరాజ్ అత్తమామ, బావమర్దులు అక్కడికి వచ్చారు. మాట్లాడుకుందాం అని చెప్పి సిరాజ్‌ను తీసుకుని వెళ్లిపోయారు.

Also Read:Marijuana: గంజాయి.. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి..

అలా బావమర్దులతో కలిసి వెళ్లిన సిరాజ్.. తిరిగి రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లారు తల్లిదండ్రులు. మరుసటి రోజు కూడా సిరాజ్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. దీంతో మరోసారి పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. ఐతే అప్పటికే పోలీసులు ఓ మృతదేహాన్ని కాచిగూడ రైల్వే ట్రాక్ దగ్గర గుర్తించారు. అక్కడి సిరాజ్ తల్లిదండ్రులను తీసుకు వెళ్లారు. మృతదేహాన్ని చూసి సిరాజేనని గుర్తించారు తల్లిదండ్రులు. దీంతో సిరాజ్‌ను తీసుకు వెళ్లి చంపేసిన అతని బావమర్దులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సిరాజ్ డెడ్ బాడీని పోస్టుమార్టం తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు..

Exit mobile version