Site icon NTV Telugu

Miss World 2024: మిస్ వరల్డ్ ఫైనల్‌ రౌండ్‌కు చేరుకున్న కన్నడ బ్యూటీ.. బ్లాక్ గౌనులో మెరిసిపోయిన సినీ శెట్టి!

Sini Shetty Miss World

Sini Shetty Miss World

Sini Shetty stuns in a black peplum gown in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్‌లో130కి పైగా దేశాల అందాల భామలు పోటీపడగా.. భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్‌ రౌండ్‌కు చేరుకున్న టాప్‌ 20లో నిలిచారు. సినీ శెట్టి సొంత గడ్డపై ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకోవాలని భారతీయులు కోరుకుంటున్నారు.

సినీ శెట్టి రేసులో ఉండడంతో మార్చి 9న ముంబైలో జరగనున్న మిస్ వరల్డ్ 2024 ఫైనల్‌పై అందరి దృష్టి ఉంది. ప్రపంచ సుందరి ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. 2017లో మానుషి చిల్లర్‌ ‘మిస్‌ వరల్డ్’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు కన్నడ బ్యూటీ సినీ శెట్టి కిరీటాన్ని కైవసం చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.

Also Read: IND vs ENG 5th Test: బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆకాష్ దీప్ ఔట్, దేవదత్ పడిక్కల్ అరంగేట్రం!

శనివారం జరిగిన పోటీకి సంబంధించిన చిత్రాలను సినీ శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ గౌనులో ఆమె చాలా అందంగా ఉన్నారు. ఫ్యాషన్ డిజైనర్ రాకీ స్టార్‌ ఈ గౌనుని డిజైన్ చేశారు. మిస్‌ వరల్డ్‌ టాలెంట్ ఫైనల్స్ రౌండ్‌లో ఐశ్వర్యా రాయ్‌ హిట్‌ సాంగ్స్‌కు సినీ శెట్టి డ్యాన్స్‌ చేశారు. హమ్ దిల్ దే చుకే సనమ్, బంటీ ఔర్ బబ్లీ వంటి మూవీలలోని హిట్‌ పాటలకు అద్భుతంగా డ్యాన్స్‌ చేసి ఐశ్వర్యకు అంకితం చేశారు. భారతీయ శాస్త్రీయ, బాలీవుడ్ నృత్య రీతుల కలయికతో సినీ శెట్టి నృత్యం చేశారు.

Exit mobile version