Site icon NTV Telugu

Singireddy Niranjan Reddy : ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదు

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడు మాసాలు పూర్తి అవుతుందని, ఇది చాలా పెద్ద సమయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, కానీ ఆరుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నం.. బీఆర్ఎస్ పని అయిపోయిందని విన్యాసాలు చేస్తున్నారన్నారు. భారత పార్లమెంటు లో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20శాతం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతకు ముందు కేవలం పది శాతానికి పరిమితం అయిందని, కానీ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ 33శాతం ప్రాతినిధ్యం కలిగివుందన్నారు నిరంజన్‌ రెడ్డి. అంటే బీఆర్‌ఎస్‌ ఉన్నట్టా లేనట్టా? అని ఆయన ప్రశ్నించారు.

 

గతంలో బీఆర్‌ఎస్‌ చేరికల పై చట్టబద్ధంగా వ్యవహరించిందని, రాజ్యాంగ బద్దంగా బీఆర్‌ఎస్‌లో విలీనాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సీఎం నేతల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని, రాజ్యాంగం కాపాడతానని రాహుల్ చెబుతున్నారన్నారు. కానీ రాజ్యాంగంలోని యాంటి డిఫెక్షన్ లా కు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన వారితో రాహుల్ ఎందుకు రాజీనామాలు చెపించడం లేదని, రాజీనామాలు చేసి పార్టీలోకి రావాలని రాహుల్ ఎందుకు చెప్పడం లేదన్నారు నిరంజన్‌ రెడ్డి. రాహుల్ గాంధీ డబుల్ స్టాండ్ ను ప్రజలు గమనిస్తున్నారని, రాహుల్ గాంధీకి నేను లేఖ రాస్తున్నాని, రాజీనామా చేయించి ఎన్నికల్లో తేల్చుకునే సత్తా లేదా? పిరికివాళ్లా? అని ఆయన అన్నారు.

Exit mobile version