రాష్ట్రంలో తాగునీటి సమస్యకు కాంగ్రెస్ పాలకులే కారణం, ప్రణాళికలు లేనీ వ్యవహారశైలి మూలమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన నాగర్‌కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వాయర్ల నీళ్లపై అబద్ధాలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్ల నీటిని సద్వినియోగపరిస్తే పంటలు ఉండేవి కావని, 100 రోజుల పాలనలో తెలంగాణను బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కల్యాణ లక్ష్మి లేదు, కెసిఆర్ ని తిట్టడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారని, కేసీఆర్ ను తిడితే రాహుల్ గాంధీ ప్రధాని కాలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పట్టుదలతో కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆదరించండి అండగా ఉంటానన్నారు. ప్రజా సేవ చేసేందుకే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి మీకోసం వచ్చానని, మీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతా మాట తప్పితే రాళ్లతో కొట్టండన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.