NTV Telugu Site icon

Mary Millben: మోడీ మరోసారి గెలుస్తారు.. అమెరికన్ల సపోర్ట్ మాత్రం ఆయనకే..

Mary Millben

Mary Millben

అమెరికా గాయని మేరీ మిల్బెన్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 2024లో భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధిస్తారని జోస్యం చెప్పింది. భారత విధానాలను కూడా ఆమె ప్రశంసించారు. అయితే, గతేడాది జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ‘జన గణ మన’ జాతీయ గీతాన్ని కూడా ఈమె ఆలపించారు. ఇండియాలో కూడా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.’అమెరికాలో మోడీకి చాలా మంది మద్దతు ఇస్తున్నారు.. భారతదేశానికి అత్యుత్తమ నాయకుడు కాబట్టి ఆయనను మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారని మేరీ మిల్బెన్ పేర్కొనింది.

Read Also: BJP: బీజేపీ కీలక నిర్ణయం.. 12 మంది జిల్లా అధ్యక్షుల మార్పు..!

అయితే, ఈ ఎన్నికల సీజన్ లో అమెరికా- భారతదేశంతో పాటు ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన ఎన్నికల సీజన్‌లలో ఒకటిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పౌరులుగా మనపై కూడా పెద్ద బాధ్యత ఉంది అని యూఎస్ సింగర్ మేరీ మిల్బెన్ చెప్పారు. ప్రధాన మంత్రి మోడీకి నా మద్దతు ఇస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి కూడా ఆమె ప్రస్తావించారు.. అలాగే మహిళా నేతలను మంత్రివర్గంలో చేర్చుకున్నందుకు మోడీని ప్రశంసించారు.. ఆయన విధానాలు భారతదేశాన్ని నిజమైన ఆర్థిక వ్యవస్థగా నిలిపాయని సింగర్ మేరీ మిల్బెన్ వెల్లడించారు.

Show comments