Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ పాపులర్ సింగర్ మంగ్లీ (సత్యవతి చౌహాన్) చిక్కుల్లో పడ్డారు.. తన పాటలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె, ఇప్పుడు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కోవడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తనను రూ. 10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కేవలం ఆర్థిక మోసమే కాకుండా, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపుతోంది. బాధితుడు అందించిన ఆధారాల మేరకు పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు..
Also Read: Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
Also Read
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కొత్త చట్టం ప్రకారం బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్ 351 (2), 352 కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలోనూ మంగ్లీ కొన్ని వివాదాల్లో నిలిచినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో ఆర్థిక మోసం, బెదిరింపుల ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. దీంతో ఆమె కెరీర్‌పై ఈ కేసు ప్రభావం ఎంతవరకు ఉంటుందనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది.
తీన్మార్ వార్తల ద్వారా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ, తెలంగాణ జానపద పాటలతో అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ‘రాములో రాములా’, ‘సారంగదరియా’, ‘జింతాక్’, ‘జ్వాలారెడ్డి’ వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఏపీలో పుట్టినప్పటికీ తెలంగాణ యాసపై పట్టుతో బతుకమ్మ, బోనాల పాటలతో జనానికి బాగా దగ్గరయ్యారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఇలాంటి క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఆరోపణలపై మంగ్లీ టీం నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?