Singer Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ తాను పాడిన ఒక హిందీ పాట వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కన్నడ యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) సినిమా కోసం ఆమె పాడిన ‘సర్కే చునార్ తేరి సర్కే’ (Sarke Chunar Teri Sarke) పాటపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంగ్లీ బహిరంగంగా క్షమాపణలు కోరుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. “ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాను. ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ ఈ పాటను అన్ని సోషల్ మీడియా, మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ నుంచి తొలగించాము” అని మంగ్లీ తన పోస్ట్‌లో తెలిపారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చారు.
READ ALSO: Modi-Sonia Gandhi: ఒకే ఫ్రేమ్‌లో మోడీ-సోనియాగాంధీ.. ఫొటో వైరల్
లిరిక్స్‌లో మార్పులు.. త్వరలో కొత్త వెర్షన్!
వివాదానికి కారణమైన పాటలోని సాహిత్యాన్ని (Lyrics) ఇప్పటికే మార్చినట్లు మంగ్లీ వెల్లడించారు. అప్డేట్ చేసిన కొత్త వెర్షన్ సాంగ్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే విడుదలైన హిందీ లిరికల్ వీడియోపై విమర్శలు రావడంతో చిత్ర యూనిట్, మంగ్లీ స్పందించి క్షమాపణలు చెప్పారు.
READ ALSO: Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. పార్ట్ 3 పై సంచలన పోస్ట్!